ఎల్లప్పకు నామినేటెడ్ పదవి కేటాయించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్
న్యూస్ వెలుగు, కర్నూలు కలెక్టరేట్ : కర్నూలుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్పకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవిఇవ్వాలని విభిన్న ప్రతిభావంతులు,ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఎల్లప్ప ఎన్నో సంవత్సరాల నుంచి దివ్యాంగులకు సేవ చేస్తున్నారని వారు తెలిపారు.వికలాంగులకు ఫింక్షన్లు,ఇంటి స్థలాలు,సదరం సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారన్నారు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్లప్ప తెలుగు దేశం పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని పార్టీ అభివృద్ధికి కృషి చేశారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వ పెద్దలు స్పందించి ఎల్లప్ప కు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయో వృద్ధుల సహకార సంస్థ చైర్మన్ పదవి ఇప్పించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మద్దిలేటి,సురేష్, వెంకటేశ్వర్లు,శివనారాయణ,లాలి, మద్దిలేటి,చంద్రశేఖర్ యాదవ్,ఉదయ్ కిరణ్,బీరప్ప,తదితరులు పాల్గొన్నారు.