ఈ నెల 8వ తేదీన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష

ఈ నెల 8వ తేదీన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష

  ఎస్.శామ్యూల్ పాల్,కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి

న్యూస్ వెలుగు, కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లాలో ఈ నెల 8వ తేదీన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ ఎం ఎం ఎస్)- 2024నకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడడం జరిగిందని అన్నారు.ఈ పరీక్ష ఆదివారం ఉ. 10.00 గంటల నుండి మ.01.00 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షకు మొత్తం 3865మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు.మొత్తం 18పరీక్షా కేంద్రాలు,02రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో ఏర్పాట్లుచేశామని చెప్పారు.ఇందులో 18 చీఫ్ సూపరింటెండెంట్లు,18 డెపార్ట్మెంటల్ ఆఫీసర్లు,02ప్లయింగ్ స్క్వాడ్లు ఇన్విజిలేటర్లు,ఇతర సిబ్బంది నియమకాలు జరిపినట్లు పేర్కొన్నారు.

విద్యార్ధులకు సూచనలు:

> విద్యార్థిని విద్యార్థులు,పరీక్ష జరుగు ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని వారికి కేటాయించిన గదిని చూసుకొని ఆ గదిలో వారికి కేటాయించిన నెంబర్ ని సరిచూసుకొని ఆ సీట్లో మాత్రమే కూర్చోవలెను.అదేవిధంగా పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైన కూడా అనుమతించరు.పరీక్ష పూర్తి అయ్యే వరకు బయటకు వెళ్లరాదు.

> విద్యార్థిని విద్యార్థులు వారికి ఇచ్చిన ఓఎం ఆర్ వారిదో,కాదో సరిచూసుకొని అందులో వారి సంతకం కోసం కేటాయించిన ప్రదేశంలో సంతకం చేయవలెను. జవాబులను బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెస్ తో మాత్రమే బబుల్ చేయవలెను.

> విద్యార్థులు ఫోటో అటెండన్స్ షీట్ లో సంతకం చేసే ముందు వారికి సంబంధించిన వివరాలు.అనగా తండ్రి పేరు,పుట్టిన తేదీ,పి హెచ్,అన్నీ వివరములు పరిశీలించి సరిగా ఉన్నది,లేనిది నిర్ధారించుకొని,ఒకవేళ తప్పులు ఉన్నట్లయితే సంభందిత పరీక్షాకేంద్ర అధికారులకు తెలియజేయవలెను.

> విద్యార్థులు పరీక్ష కేంద్రములోనికి ఎటువంటి మొబైల్ ఫోన్లు,చేతి గడియారం, క్యాలిక్యులేటర్,ఎలక్ట్రానిక్ పరికరాలు లోనికి తీసుకెళ్లరాదు.ఒకవేళ అటువంటి వస్తువులతో విద్యార్థి పట్టుబడిన యెడల ఆ విద్యార్థి యొక్క పరీక్షను రద్దు చేయడం జరుగుతుంది.

> పరీక్ష పూర్తి అయిన తర్వాత ఓఎం ఆర్ ను ఇన్విజిలేటర్ కు తప్పకుండా అప్పగించవలెను.పరీక్ష ముగిసిన పిదప ప్రశ్నా పత్రాన్ని విద్యార్థి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లవచ్చును.కావున విద్యార్థిని, విద్యార్థులు ఖచ్చితంగా పాటించి పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగడానికి సహకరించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.శామ్యూల్ పాల్ సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!