
బదిలీ అయిన పోలీసు అధికారులకు ఘనసన్మానం
బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో 14 మంది సిబ్బంది బదిలీ
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ అయిన పోలీస్ సిబ్బందికి ఆదివారం ఘనంగా సన్మానించారు.ఎస్సై జగన్మోహన్ ఆధర్వంలో బదిలీ అయిన సిబ్బందికి శాలువా వేసి పూలమాలలతో సన్మానించారు.గత కొన్ని సంవత్సరాలుగా బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 14 మంది అధికారులను వివిధ ప్రాంతాలకు సాధారణ బదిలీల భాగంగా ఉన్నతాధికారులు బదిలీ చేసినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. సిబ్బందికి సన్మానం అనంతరం ఎస్సై మాట్లాడుతూ శాంతి భద్రతల నిర్వహణలో పోలీస్ సిబ్బంది కృషి ఎనలేనిదని విధినిర్వహణలో బాధ్యతగా పనిచేసిన సిబ్బందిని మెచ్చుకున్నారు. ప్రజలకు సంబంధించిన సేవలే చిరస్థాయిగా నిలుస్తాయని బదిలీపై వెళ్తున్న సిబ్బందిని ఘనంగా వీడ్కోలు పలికారు. బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 14 మంది బదిలీ కావడం విశేషం. ఇందులో ముగ్గురు ఏ ఎస్సై లు, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్లో, ఎనిమిది మంది కానిస్టేబుళ్ళు బదిలీ అయ్యారు. ఏఎస్ఐలు అక్బర్ ,వెంకటేశ్వర్లు, రీఠా, హెడ్ కానిస్టేబుళ్లు లింగస్వామి ప్రసాద్ ,వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుళ్లు సుభాన్, శివలింగం ,వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, గంగారామ్, మహబూబ్ వలి,రమాప్రభ తదితరులు బదిలీ అయ్యారు.