
వ్యాయామంతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది
శ్రీధర్, రాష్ట్ర జూడో సంఘం కార్యదర్శి
న్యూస్ వెలుగు, కర్నూలు స్పోర్ట్స్ : విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని రాష్ట్ర జూడో సంఘం కార్యదర్శి శ్రీధర్ అన్నారు.సోమవారం జిల్లా జంప్ రోప్ సంఘం ఆధ్వర్యంలో అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఆయన రాష్ట్ర సెపక్తక్రా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు,రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు క్రీడా సాధనకు కొంత సమయాన్ని కేటాయిస్తే మేటి క్రీడాకారులుగా తయారవుతారని అన్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 15వరకు సత్యసాయి జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లావ్యాప్తంగా ఎంపిక పోటీలకు వందమంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా జంప్ రోప్ సంఘం కార్యదర్శి జోసఫ్ వ్యాయామ ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar