
ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ (NFIW) జాతీయ సమితి సభ్యురాలిగా శ్రావణి ఎంపిక
న్యూస్ వెలుగు, కర్నూలు; జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ) జాతీయ సమితి సభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కర్నూలు జిల్లా కార్యదర్శి శ్రావణి ఎన్నిక పట్ల ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కర్నూల్ నగర కార్యదర్శి భారతి నగర నాయకురాలు రేణుక ఒక ప్రకటనలో వర్షం వ్యక్తం చేశారు.భారతి రేణుక మాట్లాడుతూ ప్రస్తుతం శ్రావణి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కర్నూలు జిల్లా కార్యదర్శిగా జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన అనేక పోరాటాలు కొనసాగిస్తుందని మహిళా లోకానికి అండగా నిలుస్తుందని కొన్నియాడారు శ్రావణి ఢిల్లీ నగరంలో జరుగుతున్న జాతీయ మహిళా సమాఖ్య( NFIW) 22 వ జాతీయ మహాసభలలో జాతీయ సమితి సభ్యురాలుగా ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమని వారు తెలిపారు భవిష్యత్తులో శ్రావణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన మడమ తిప్పని పోరాటాల నిర్వహిస్తూ భారత రాజ్యాంగం మహిళల కనిపించిన హక్కుల పరిరక్షణ కోసం భారతీయ సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల పట్ల పోరాటాలు సాగిస్తూ మహిళలకు అండగా ఉంటూ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని తెలిపారు.