దళిత మహిళపై ఆటవిక చర్యకు పాల్పడడం సిగ్గుచేటు

దళిత మహిళపై ఆటవిక చర్యకు పాల్పడడం సిగ్గుచేటు

స్తంభానికి కట్టేసి కొట్టి, వివస్త్ర కు పాల్పడిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి
సోమప్ప సర్కిల్ నందు KVPS ఆధ్వర్యంలో ధర్నా
 KVPS జిల్లా అధ్యక్షులు యస్.దేవసహాయం డిమాండ్
ఎమ్మిగనూరు,న్యూస్ వెలుగు ; భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ దళిత గిరిజనులపై దాడులు హత్యలు అ

త్యాచారాలు,మానభంగాలు, దౌర్జన్యాలు,అరాచకాలు శిరోమండనాలు పరంపరంగా కొనసాగుతూనే ఉన్నాయని, నిలువరించడంలో పాలకులు, అధికారులు ఘోరంగా విఫలం చెందారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) కర్నూలు జిల్లా అధ్యక్షులు యస్. దేవ సహాయం ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకడూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగ గోవిందమును స్తంభానికి కట్టేసి కొట్టిన సంఘటనపై నిరసిస్తూ శుక్రవారం సోమప్ప సర్కిల్ నందు ఆందోళన ధర్నా కార్యక్రమం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మాట్లాడుతూ… కర్నూలు జిల్లా, పెద్దకడబూరు మండలం, కల్లుకుంట గ్రామంలో.. ఎస్సీ మాదిగ కులమునకు చెందిన గోవిందమ్మ కుమారుడు ఈరన్న ఆరు నెలల క్రితం బీసీ చాకలి సామాజిక వర్గానికి చెందిననాగ లక్ష్మి అనే యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కక్ష సాధింపుగా, కుల దురహంకారంతో… నిన్నటి దినం గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో వితంతువైన మాదిగ గోవిందమ్మ ను చాకలి ఎర్రన్న, చాకలి ముకప్ప వారి సమీప బంధువులు అందరూ ఏకమై ఒంటరి మహిళను ఇంటి నుండి ఈడ్చుకుంటూ.. దళిత మహిళను వివస్త్రకు పాల్పడుతూ.. దుస్సాసనపర్వం తలపించేలా వ్యవహరించి కరెంటు స్తంభానికి నిర్బంధించి కట్టేసి కొట్టి అత్యాచారయత్నమునకు పాల్పడి యువతి అన్న అయిన వికలాంగుడిచేత వితంతువురాలు గోవిందమ్మకు తాళి కట్టించే ప్రయత్నం చేయడం ఆటవిక చర్య అని దీనిని కెవిపిఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా! లేక రాచరిక వ్యవస్థలో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ దుర్ఘటన సమయంలో సమయానికి పోలీసులు రాక పోయి ఉంటే చనిపోయేదని ఆవేదన చెందారు. ఈ అవమానవీయ దుర్ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించి నేరానికి పాల్పడిన మానవ మృగాలపై కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షలు విధించి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో.. చలో కల్లుకుంట కార్యక్రమానికి పిలుపునిచ్చి జిల్లావ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు సుమల అంతోని, సోగనూరు మనోహర్, కలుగొట్ల రాజు, మెకానిక్ సుమాల రాజు, కదిరి కోట భాస్కర్, ఎర్రకోట అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!