ఉజ్వల భవిష్యత్తు చదువుతోనే సాధ్యం

ఉజ్వల భవిష్యత్తు చదువుతోనే సాధ్యం

హోళగుంద, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్&టీచర్స్ కార్యక్రమం ఆదివారం ఎల్లార్తి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు నియోజకవర్గ టీడీపి సీనియర్ నాయకులు మల్లికార్జున,పాఠశాల ఛైర్మన్ బోయ లక్ష్మీ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాల సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు కానిస్టేబుల్ గురు ప్రసాద్,గ్రామ పెద్దలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!