ఘరానా మోసం చేసిన రామాంజినేయులు పై కేసు నమోదు చేయాలి

ఘరానా మోసం చేసిన రామాంజినేయులు పై కేసు నమోదు చేయాలి

బాధితులకు డబ్బులు చెల్లించాలి
సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం రాముడు డిమాండ్

డోన్, న్యూస్ వెలుగు;  పట్టణంలో దాదాపు 340 మందిని మోసం చేసి 25 కోట్ల రూపాయలు చీటింగ్ చేసిన రామాంజనేయులుపై కేసు నమోదు చేసి బాధితుల నుండి వసూలు చేసిన డబ్బులు వారికి చెల్లించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం రాముడు సహాయ కార్యదర్శి ఎన్ కె రామమోహన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యు రంగరత్నం డిమాండ్ చేశారు. పట్టణంలో గత రెండు సంవత్సరాల నుండి శ్రీ రామ టాకీస్ దగ్గర్లో ఆఫీస్ ప్రారంభించి అక్కడ నుండి ఒక లక్ష రూపాయలు ఇస్తే నెలకు 10000 కలుపుకొని 1,10,000 చెల్లిస్తానని ఉద్యోగులను మధ్యతరగతి ప్రజానీకానికి మభ్యపెట్టి మోసం చేయడం దారుణమని ఇలాంటి వారిపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు
రామాంజనేయులు అనే వ్యక్తి గతంలో కూడా అనేక మోసాలు చేశాడని అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు గ్రామానికి చెందిన ఈయన అక్కడ చీటీల పేరుతో 90 లక్షలు మేర మోసం చేసి ఐపి పెట్టి కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ప్రవేట్ స్కూల్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ అక్కడ కూడా మోసాలు చేసిన ఘన చరిత్ర ఉంది అన్నారు అదేవిధంగా మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల ప్రాంతాల్లో మోసాలు చేసి చివరకు డోన్ కేంద్రంగా చేసుకొని కోట్ల రూపాయలు మోసం చేశాడని వారు ఆరోపించారుఇలాంటి ఆర్థిక నేరస్తులపైన పోలీసులు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో కోర్టులో సిపిఐ తరఫున ప్రజా వ్యాజ్యం కింద ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!