సంక్షేమ పథకాలును విస్మరించిన కూటమి ప్రభుత్వం
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు సిఐటియు నాయకులు దాసరి విజయ్ ఎన్జీ హోమ్ లో విలేకరులతో మాట్లాడుతూ . టిడిపి పార్టీ అగ్ర నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వాని కంటే మరిన్ని మెరుగైన పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ గెలిచి ఐదు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకపోవడంతో ప్రజల చేతల్లో డబ్బులు లేక పెరుగుతున్న నిత్యవసర ధరలను భరించలేక పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.పథకాలన్నీ అటకెక్కించే యోచనలో ఉన్నారేమోనని ఏపీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాల జెండాలు ఎన్ని మారిన రాజకీయ పార్టీల అజెండా మాత్రం ఒక్కటే రాష్ట్ర ప్రజలను వంచించడమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఒంటరి మహిళ పెన్షన్ లేదు. తల్లికి వందనం లేదు. ఒక ఇంటికి 3 సిలిండర్లు. లేవు 18సంవత్సరాలు దాటిన మహిళకు నెలకు 15 వందలు లేవు. చేనేతలకు ఉచిత కరెంటు 5 వందల యూనిట్లు మంగళం. మహిళలకు ఉచిత బస్సుప్రయాణం. విద్యార్థులకు స్కాలర్షిప్లులు. ఇవి కాక.ఇంకా మరెన్నో సూపర్ సిక్స్ లో ఉన్న పథకాలు అన్నిటిని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కురిసినందున పొలాలలో ఫైర్లు వేయక ఎక్కడ చెయ్యడానికి ఏపనులు లేక కూలి నాలి చేసుకునే ప్రజలు అర్థాకళితో అలమటిస్తున్నారు . ఈ సమయంలో ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే వారు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను అమలు చేసి అర్ధాకలితో ఉన్న ప్రజలను ఆదుకోవాలని వారు తెలిపారు. కార్యక్రమంలో భీమ. వెంకటేష్ నాయక్. పాల్గొన్నారు