విలువలకు పట్టం కట్టిన భాష్యం
అనిల్ కుమార్,రాయలసీమ సీఈఓ
న్యూస్ వెలుగు, కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలులో జరిగిన భాష్యం ప్రీమియం లీగ్ లో భాష్యం బాలాజీ నగర్ పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. రాయలసీమ సీఈఓ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ కుసుమ ఆధ్వర్యంలో ప్రీమియం లీగ్ పోటీలలో భాష్యం బాలాజీ పాఠశాల విద్యార్థులు సెంట్రల్ లెవెల్ కు ఇద్దరు విద్యార్థులు ఎన్నికయ్యారు.ఈ పోటీలలో యశ్వంత్ , ఫర్హాన్ సెంట్రల్ లెవెల్ కు ఎన్నికయ్యారు. క్రికెట్ ఆటలో ద్వితీయ స్థానాన్ని సంపాదించారు.భాష్యం పాఠశాలలో కేవలం విద్యా,క్రీడలు మాత్రమే కాకుండా విలువలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులు తమకు వచ్చిన మెడల్స్ ను తల్లిదండ్రులకు వేసి తల్లిదండ్రుల పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు.ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ కుసుమ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి క్రీడలను నిర్వహించడంతోపాటు విద్యార్థులకు విలువలను నేర్పటంలో భాష్యం స్కూల్ యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.రన్నర్స్ గా నిలిచిన విద్యార్థులను,సెంట్రల్ స్థాయి పోటీలకు ఎంపికైన ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు.జనవరిలో జరిగే సెంట్రల్ స్థాయి పోటీలలో విజయం సాధించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం పీఈటీలు విద్యార్థులు పాల్గొన్నారు.