
ఒక్కరోజు ముందుగానే పింఛన్ల పండుగ
ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసిన టిడిపి నాయకులు, సచివాలయ సిబ్బంది.
హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఒక్కరోజు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పండుగను నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు,టిడిపి నాయకులు మాభాష,లక్ష్మీనారాయణ, రామయ్య లు తెలియజేశారు.తుగ్గలి మండల పరిధిలోని అన్ని గ్రామాల యందు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది వేకువజాము నుండే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు లబ్ధిదారులతో మాట్లాడుతూ డిసెంబర్ 1 ఆదివారం సెలవుదినం కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గ్రామ సచివాలయ ఇబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలియజేశారు.అర్హత కలిగిన వారు నూతన పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని వారు తెలియజేశారు. త్వరలో నూతన రేషన్ కార్డులకు కూడా అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని టిడిపి నాయకులు లబ్ధిదారులకు తెలియజేశారు.ఇచ్చిన మాట ప్రకారం మిగతా సూపర్ సిక్స్ పథకాలను త్వరలోనే అన్ని అమలు చేస్తామని వారు తెలియజేశారు.మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల యందు గ్రామ టిడిపి నాయకులు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో రాంపల్లి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు,అక్బర్ బాషా,కోటేష్ గౌడ్, శవాసప్ప,గ్రామ సచివాలయ సిబ్బంది, తదితర గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.