
సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం
11:30 దాటిన ప్రారంభం కానీ సమావేశం…
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి నూర్జహాన్ బి అధ్యక్షతన గురువారం రోజున మండల సర్వసభ్య సమావేశం సాదా సీదాగా సాగింది.గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు,ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు,తదితర అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే సర్వ సభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీటీసీ కురువ బొజ్జమ్మ,ఎంపీడీవో విజయ లలిత,ఈవోపీఆర్డి చక్రవర్తి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆలస్యంగా 11:30 గంటలు దాటిన కూడా నామమాత్రంగానూ సాగింది. ప్రజా ప్రతినిధులు , అధికారులు కొంతమంది రాకపోయినా వచ్చిన వారితోనే సమావేశాన్ని తూ తూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు.మండల సరసభ్య సమావేశానికి విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజల సమస్యలను వివరించే వారు లేరని,అధికారులు ఆడిందే ఆట-పాడిందే పాటగా మారిందని ప్రజలు వాపోతున్నారు.మండల సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలపై కానీ అభివృద్ధి పై కానీ సమగ్రంగా చర్చ జరిగిన దాఖలాలు లేవని వాపోతున్నారు.మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినవి,జరుగుతున్నాయో మండల ప్రజలకు తెలియదు. అంతేకాకుండా గత సమావేశంలో ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన అభ్యర్థనలో పరిశీలన మరియు వాటి పనితీరు వివరాలు కూడా అధికారులు తెలపలేదు. స్థానికంగా మండలంలోని సులువాయి,ఇంగళదహాల్ పాఠశాలలను స్కూల్ కాంప్లెక్స్ గా కేటాయించాలని ఆ గ్రామస్తులో సులువాయి రాఘవేంద్ర చౌదరి, ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్ లు మండల విద్యాధికారి జగన్నాథంకు వినతి పత్రాన్ని సమర్పించారు. అదేవిధంగా తామగ్రామానికి వచ్చిన స్కూలు కాంప్లెక్స్ లో తొలగించరాదని కూడా ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చాముండేశ్వరి యువ నాయకుడు దర్గన్న అధికారులను విన్నవించారు. అనంతరం సమ్మతగేరి గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందనే మరొక ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని సమ్మతిరిగే సర్పంచు తప్పట శోభ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. మండల కేంద్రంలోని హోళగుంద ఎస్ ఎస్ ట్యాంకు గత సంవత్సరం నీటి నిల్వ ఎక్కువగా ఉండటంతో ట్యాంకు గట్టు గతంలోనే కృంగిపోయిందని, వాటిని మరమ్మతులు చేపట్టి రాబోయే వేసవికి దాహార్తిని తీర్చాలని కోరగా ప్రభుత్వానికి నివేదిక పంపామని నిధులు మంజూరై ఆదేశాలు వస్తే తప్పకుండా నిర్మాణ పనుల్లో త్వరితగతిన పూర్తి చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామ్ లీలా అన్నారు. పొదుపు మహిళా సమాఖ్య ద్వారా మహిళలకు సర్వోన్నతాభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారికి సాయం అందిస్తున్నట్లు పొదుపు ఏపీ ఎం సూర్య ప్రకాష్ అన్నారు. పలు శాఖల సమస్యలపై హాయ్ ఆ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని ఎంపీడీవో విజయ లలిత ఈవోపిఆర్డి చక్రవర్తిలో ఆయా శాఖల అధికారులకు సూచించారు. అలాగే అధికారుల మరియు ప్రజాప్రతినిధుల అరకొర సమావేశం తో సర్వసభ్య సమావేశం ప్రతిసారి మాదిరిగానే నామమాత్రంగానే జరుగింది.మండల సర్వసభ్య సమావేశంలో కొందరు అధికారులు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకొని వారు మాత్రమే నామమాత్రంగా వివరాలు చెప్పుకొని 2గంటల సమయంలోనే సమావేశం ముగించుకుంటున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి.ఇప్పటివరకు జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు అవి అమలు అయిన తీరు ఎవరికి తెలియవు.ఈ సమావేశంలో సమస్యలపై చర్చకు దారి తీసే నాయకులే మండలంలో కరువయ్యారు. దీంతో మండలంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మండల సర్వసభ్య సమావేశాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసి మండలంలో వివిధ శాఖలు పనిచేస్తున్న తీరు,వాటి అభివృద్ధి, వచ్చిన నిధులపై సమగ్రమైన చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.కొన్ని శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంతో పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈ యమునప్ప, హౌసింగ్ ఏఈ రవి వర్మ, ఉపాధి ఏపీఓ భక్తవత్సల్యం, ఎం ఏ ఓ ఆనంద్ లోకదల్, పంచాయతీ సెక్రటరీలు రాజశేఖర్ గౌడ్, రాజ్ కుమార్, రంగస్వామి, సర్పంచులు చలువాది రంగమ్మ ,నాగప్ప నాయుడు, రమేష్, వెంకట్ రెడ్డి, ఎంపీటీసీలు శివన్న, మల్లికార్జున,హనుమప్ప, నాయకులు ఈసా, దర్గన్న,వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటీసీలు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.