ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి:మండల కేంద్రమైన తుగ్గలి నందు గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహించిన జయలక్ష్మి పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల యందు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ కలసి ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి కు గజమాలతో సన్మానించి బహుమతిని ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కొరకు ప్రధానోపాధ్యాయులు జయలక్ష్మి చేసిన సేవల గురించి వారు కొనియాడారు. పాఠశాల అభివృద్ధి కొరకు మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారన్నారు.క్రీడలలో ప్రతిభ చాటిన విద్యార్థులను కూడా ఎంతో ప్రోత్సహించారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు బాబురావు, విద్యా కమిటీ చైర్మన్ రంగస్వామి, ఉపేంద్ర,జాకీర్ హుస్సేన్,అరుణకుమారి, సుధాకర్ గౌడ్,నారాయణ, ఫిజికల్ డైరెక్టర్ సంధ్యా నాయక్,పాఠశాల విద్యార్థుని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!

COMMENTS