
మిత్రుడికి అపన్న హస్తం….
మిత్రుడికి అండగా చిన్ననాటి స్నేహితులు
హోళగుంద, న్యూస్ వెలుగు: తమతోపాటు కలిసి చదువుకున్న మిత్రుడు అనారోగ్యంతో భాదపడుతున్న విషయాన్ని తెలుసుకుని తోటి మిత్రులు ఆర్థిక సహాయాన్ని అందించి నీకు మేమున్నామన్న భరోసా కల్పించారు.శుక్రవారం మండల పరిధిలోని మార్లమాడికి గ్రామానికి చెందిన రామాంజి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న 2006 పడవ తరగతి బ్యాచ్ మిత్రులు కలిసి నగదును శుక్రవారం కర్నూలు అస్పత్రిలో పెద్దహ్యాట మల్లయ్య,చిన్న మల్లయ్య, తిమ్మరెడ్డి,సుధా,ద్యావన్న తదితరులు రామాంజి కుటుంబ సభ్యులకు రూ.41,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అలాగే మిత్రుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం డాక్టర్ తో మాట్లాడి రామాంజి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.మరియు మిత్రుడు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
Was this helpful?
Thanks for your feedback!