
కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు.ప్రజా గళం సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అలాగే సిఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారని పేర్కొన్నారు. కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ ఉందని తెలియజేశారు. 1952లో భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదట కర్నూలు రాజధానిగా ఉందని, తరువాత రాజధాని హైదరాబాద్‌కు మార్చబడిందని తెలిపారు. 2014లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాజధాని, హైకోర్టు అమరావతికి మార్చారని వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!