పోర్జరి సంతకాలతో అధ్యక్ష ఎన్నిక చెల్లదు
Puttaparthi (పుట్టపర్తి ) జూలై 31: శ్రీ సత్య సాయి జిల్లా వడ్డెర కార్యవర్గ సభ్యులు సమావేశం బుధవారం పుట్టపర్తి లో నిర్వహించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ దాదాపు రెండు సంవత్సరముల నుండి నడుస్తున్నటువంటి వడ్డెర సంఘంను 26-07-2024 న కొందరు వడ్డెర సంఘాన్ని చిన్నాభిన్నం చేసి , రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లు సంఘంలోని సభ్యులు ఆరోపించారు. భారత రాజ్యాంగ సహకార చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎలాంటి సంఘం సమావేశాలు ఏర్పాటు చేయకుండా , సంఘ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే నూతన వర్గాన్ని ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. పాలకవర్గంలో హోదా కలిగిన వ్యక్తులను తొలగించే క్రమంలో పాటించాల్సిన చట్టబద్ధ ప్రక్రియను కూడా విస్మరించి ఏకపక్షంగా కుట్రపూరిత మైన పథకంలో భాగంగా జిల్లా సంఘం అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న జెరిపిటి కృష్ణమూర్తి ,జిల్లా సంఘం గౌరవాధ్యక్షులు సిమెంట్ పోలన్న , ఈసి మెంబర్లు వెంకటరమణ , శ్రీనివాసులు ను తొలగిస్తున్నట్లు తెలిపారు. వీరు సంఘం ఫోర్జరీ సంతకాలు చేసి ఈ యొక్క తతంగం జరిపినట్టు వెల్లడించారు.
ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరినైతే తొలగించారో వారి సంతకాలు ఫోర్జరీ చేయడం గమనార్హం. కనుక వారు ఫోర్జరీ సంతకాలతో సమర్పించిన నకిలీ పత్రాలు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో పరిశీలించడం జరిగిందని దీనిపై కార్యాలయంలో నిజమైన వడ్డెర సంఘం పాలకవర్గం సభ్యులను స్వయంగా ప్రవేశపెట్టి వారి సంతకాలను సరిపోల్చడం కూడా జరిగిందన్నారు. కనుక పాలకవర్గాన్ని మరియు ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే లా వ్యవహరించడం సిగ్గుచేదని సంఘ పెద్దలు అన్నారు. ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేసినట్లు వడ్డెర సంఘం దృష్టికి వస్తే పోలీసులకు ఫిర్యాదులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
వడ్డెర సంఘం జిల్లా పాలకవర్గాన్ని మరియు వడ్డెర కులాన్ని తప్పుదోవ పట్టించిన దలవాయి వెంకటనారాయణ, గోగుల చక్రపాణి , దండగల మారెప్ప ,కదిరి ఉత్తన్నల ను అతి తొందరలో జిల్లా సమావేశం ఏర్పాటు చేసి కుల పెద్దలు మరియు నాయకుల సమక్షంలో తొలగించి బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిమెంట్ పొలన్న,బోయ ముతక శ్రీనివాసులు, రామంజి నేయులు, డి. వెంకట రమణ, టి.మల్లిఖార్జున, కె. వెంకటపతి, ఈ.జయమ్మ తదితర వడ్డెర సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.