ఎర్రగుంట్లలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
రైతులు అధిక ఎరువుల వాడకం తగ్గించాలి
జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ
బండి ఆత్మకూరు వెలుగు న్యూస్: రైతులు పంట పొలాలకు అధిక ఎరువుల వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ అన్నారు. మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రైతుల సమావేశం ఏర్పాటు చేసి ఎరువులు, అధిక వర్షాల వలన పంటలు దెబ్బతినకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ ఎరువులను భూసార పరీక్షల ఆధారంగా వాడాలని, కాంప్లెక్స్ ఎరువులు దుక్కిలోనేవాడాలన్నారు.పురుగుల మందులు, ఎరువులు అధికంగా వాడటం తగ్గించుకోవాలని తద్వారా రైతులకు ఖర్చు తగ్గుతుందని తెలియజేశారు. అధిక వర్షాలకు పొగాకు దెబ్బతింటుందని అందుకు 19.19.19 లేదా KNO3 చల్లుకోవడం వలన పొగాకు త్వరగా కోలుకుంటుందని రైతులకు తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి స్వాతి మాట్లాడుతూ మండలంలోని అన్ని RSKలలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం మొక్కజొన్న పంట దగ్గరకు వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో ఏడిఏ రాజశేఖర్, సర్పంచ్ కాలూరి శ్వేతకుమార తదితరులు పాల్గొన్నారు.