మద్దికేరలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర మండలం మద్దికేర గ్రామ రైతు సేవా కేంద్రం2 నందు పోలం పిలుస్తుంది కార్యక్రమంను మంగళవారము రోజున అధికారులు నిర్వచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి రవి ఆధ్వర్యంలో భూసారా పరీక్ష ఫలితాల కార్డు సలహాలపై ఆత్మ వారిచే అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా ఆత్మ బీటీఎం యశ్వంత్ భూసార పరీక్ష కార్డు యొక్క ఉపయోగాల గురించి రైతులకు వివారించారు.మండల వ్యవయాధికారి రవి మాట్లాడుతూ ప్రస్తుత సాగు చేసిన శనగ,జొన్న,వాము పంటలలో చేపట్ట వలసిన సస్య రక్షణ,యాజమన్య పద్ధతులను రైతు సహోదరులకు క్లుప్తంగా వివారించారు.అనంతరం భూసార పరీక్షా పత్రాలను రైతు సహోదరులకు అందచేయడం జరిగింది. అలాగే తప్పని సరిగా డిసెంబర్ 15 లోపు పంట భీమా నందు నమోదు చెసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భోజరాజు, వ్యవసాయ సహాయకులు జాకీర్ హుస్సేన్,రాణి,కవిత మరియు రైతు సహోదరులు తదితరులు పాల్గోన్నారు.