ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు ముగిసిన శిక్షణ తరగతుల కార్యక్రమం
బండి ఆత్మకూర్ న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు 18,19 తేదీలలో పంచాయతీరాజ్ అధికారులు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులు భాగంగా పరిపాలన విధానంపై పారిశుధ్యం మరియు వ్యర్ధాలు వర్మి కంపోస్ట్ డ్రైనేజీ వీధి దీపాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై పంచాయతీ అధికారులు వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దస్తగిరి మాట్లాడుతూ గ్రామాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అనంతరం రెండు రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి రామకృష్ణవేణి పిఆర్ఏఈ వెంకటరాముడు పంచాయతీ కార్యదర్శులు ఉపసర్పంచులు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.