
కోరం లేక మరోసారి నిలిచిపోయిన మండల సర్వసభ్య సమావేశం
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి సభ తేదీను ప్రకటిస్తాం.
ఎంపీడీవో విశ్వమోహన్
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన తుగ్గలిలో ఎంపీడీవో కార్యాలయం నందు మొదటి రోజు వాయిదా అనంతరం బుధవారం రోజున ప్రారంభమైన మండల సర్వసభ్య సమావేశం సరైన కోరం లేనందున రెండవ రోజు కూడా నిలిచిపోయింది. వాయిదా అనంతరం రెండవ రోజు ప్రారంభమైన మండల సర్వసభ్య సమావేశం నందు తుగ్గలి మండలానికి చెందిన ఎంపీపీ ఎర్ర నాగప్ప మినహా ఎవరు హాజరు కాకపోవడంతో తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ మండల సర్వసభ్య సమావేశాన్ని నిలిపివేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్ధాంతరంగా నిలిచిపోయిన మండల సర్వసభ్య సమావేశ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించామని ఆయన తెలియజేశారు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తదుపరి మండల సర్వసభ్య సమావేశ తేదీన ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు.రెండవ రోజు కూడా సభ జరగకపోవడంతో సమావేశానికి హాజరైన వివిధ శాఖల మండల స్థాయి అధికారులు వెనుదిరిగారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర నాగప్ప, ఈఓఆర్డి శ్రీహరి,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.