కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పీడియాట్రిక్ సర్జరీ విభాగంలోని పేషెంట్ కు అరుదైన శస్త్రచికిత్స

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పీడియాట్రిక్ సర్జరీ విభాగంలోని పేషెంట్ కు అరుదైన శస్త్రచికిత్స

సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అనంతపురం జిల్లా కనేకల్ గ్రామ శివారులో 15/11/2024న ఇర్ఫాన్ అనే 12 ఏళ్ల పిల్లవాడు చెట్టు పైకి ఎక్కే క్రమంలో అదుపుతప్పి క్రిందకు పడటంతో పొత్తి కడుపులో చెట్టుకొమ్మ ప్రమాదవశాత్తు చొచ్చుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే, స్థానికుల సహాయంతో, బాధితుడిని సమీపంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. స్థానిక వైద్య సిబ్బంది ఆదేశాల మేరకు అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. ఆసుపత్రి క్యాజువాలిటీలో విభాగానికి 16/11/2024 మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాలకు క్యాజువాలిటీకి వచ్చారు. అనంతరం అదే రోజు ప్రాథమిక చికిత్స అనంతరం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌లో డా.శివ కుమార్ పీడియాట్రిక్ సర్జరీ హెచ్వైడి నేతృత్వంలోని వైద్య బృందం శస్త్రచికిత్స ద్వారా అనస్థీషియా ఇచ్చి ఎలాంటి ప్రమాదం కలగకుండా వైద్య బృందం మూడున్నర గంటల పాటు శ్రమించి చొచ్చుకొని పోయిన చెట్టు కొమ్మను విజయవంతంగా తొలగించినట్లు చిన్నపిల్లల ప్రాణాలను కాపాడిన వైద్య బృందాన్ని అభినందించినట్లు తెలిపారు ఆసుపత్రికి ఎవరు వచ్చినా అందరికీ మెరుగైన వైద్యం అందించాలని సంబంధించిన హెచ్చోడిలను ఆదేశించారు.కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.శ్రీరాములు, పీడియాట్రిక్ సర్జరీ హెచ్ ఓ డి, డా.శివ కుమార్, పీడియాట్రిక్ సర్జరీ విభాగపు వైద్యులు, డా.నరేష్, (అసిస్టెంట్ ప్రొఫెసర్), డా.మధు,(అసిస్టెంట్ ప్రొఫెసర్), డా.ప్రియాంక, పీజీ, డా.ప్రణీత్ కుమార్ రెడ్డి, ఆర్తో అసిస్టెంట్ ప్రొఫెసర్, అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఘియాజుద్దీన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా. కె.వెంకటేశ్వర్లు, తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!