
పేదలకు అండ ఎర్ర జెండా
సిపిఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణ రెడ్డి
కర్నూలు, న్యూస్ వెలుగు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ నగరంలోని 
కార్రల్ మార్క్స్ నగర్ ఏరియాలో శనివారం  నగర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ డి.నల్లన్న అధ్యక్షతన జెండావిష్కరణ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో 
సిపిఐ నగర సహాయ కార్యదర్శి c.మహేష్ కూడా పాల్గొన్నారు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ నగరంలో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుని 
పొత్తిళ్లలోనే ఆంగ్లేల చేతుల్లో కుట్ర కేసులను నిషేధాలను ఎదుర్కొని నిలబడి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినదించిన పార్టీ సిపిఐ స్వాతంత్ర ఉద్యమంలో దేశంలోనే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై నాటి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక కేసులను ఎదుర్కొని నిలబడిన పార్టీ సిపిఐ నాటి నుండి నేటిదాకా ఈ దేశంలోని పేద మధ్య తరగతి ప్రజల సమస్యలే అజెండాగా పనిచేస్తూ 100 సంవత్సరాలకి అడుగుపెడుతున్న సందర్భంగా సిపిఐ శత వార్షికోత్సవాలను సంవత్సరం పాటు కొనసాగించాలని ఈ రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొన్న ఎదుర్కొనే సమస్యలను సిపిఐ అజెండాగా పనిచేస్తుందని కూడు ,గూడు, గుడ్డ అందరికీ అందాలని దున్నేవాడికే భూమి అన్న నినాదంతో దేశంలో పోరాటాలు నిర్వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ నగర నాయకులు రంగన్న మద్దమ్మ రవి శివుడు ధరన్న మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar