పత్తికొండ నందు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలి

పత్తికొండ నందు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలి

   ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

పత్తికొండ/తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: రెవిన్యూ డివిజన్ కేంద్రం అయిన పత్తికొండ పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు,బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.రంగస్వామి లు కోరారు. గురువారం రోజున ఏపీ రాజధాని అమరావతిలో న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత ను ఎమ్మెల్యే కె.ఈ శ్యాంబాబు తో పాటు పత్తికొండ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలసి పత్తికొండలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు సహకరించాలని వినతి పత్రాన్ని వారు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వెనుకబడిన పత్తికొండ పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లేకపోవడంతో న్యాయవాదులు మరియు ప్రజలు దాదాపు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆదోనికు వెళ్ళవలసి వస్తుందని వారు తెలిపారు. ప్రస్తుతం పత్తికొండ రెవెన్యూ డివిజన్ అవడంతో సీనియర్ సివిల్ జడ్జికోర్టు ఏర్పాటుకు అవకాశం ఉందని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేష్,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,గిరిగెట్ల తిమ్మయ్య చౌదరి, న్యాయవాదులు బాలభాష,సుధాకృష్ణ, రాజశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!