
పత్తికొండ డివిజన్ పరిధిలో సబ్ కోర్టును ఏర్పాటు చేయాలి
పత్తికొండ/తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ డివిజన్ పరిధిలో సబ్ కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయశాఖ మంత్రి ఫరూక్ ను నంద్యాల లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ మరియు పత్తికొండ న్యాయవాదులు గురువారం రోజున కలిశారు.నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పత్తికొండ డివిజన్ హెడ్ క్వార్టర్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికు ఎమ్మెల్యే ద్వారా వినతిపత్రం సమర్పించారు. డివిజన్ ఏర్పడి ఐదు సంవత్సరాలు కావస్తున్న పత్తికొండలో అప్పటి వైసిపి ప్రభుత్వం సబ్ కోర్టు ఏర్పాటు చేయలేదని న్యాయవాదులు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దానికి స్పందించిన ఎమ్మెల్యే కే.ఈ శ్యామ్ కుమార్ గురువారం రోజున న్యాయశాఖ మంత్రి ఫరూక్ ను గౌరవంగా కలిసి పత్తికొండ డివిజన్ హెడ్ క్వార్టర్ లో సబ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.దానికి న్యాయశాఖ మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందించి త్వరలోనే పత్తికొండలో సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్,టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,పత్తికొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.