
విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
ఆర్విపిఎస్ రాష్ట్ర కార్యదర్శి కేసి పాములేటి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆర్విపిఎస్ రాష్ట్ర కార్యదర్శి కేసి పాములేటి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాములేటి స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం కడపలోనే స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి ఆయన అన్నారు. ఆయన మాటలకు బదులిస్తూ కేంద్రమంత్రి కుమారస్వామి ఒకవేళ ప్రతిపాదన వస్తే దీన్ని పరిశీలిస్తామని ఆయన బదులుచ్చారు. ఆయన మాటల్లో స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచన లేదు అన్నట్లుగా ఆయన చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో నిరుద్యోగులకు ఎంతో ఉపాధి అవకాశాలు వస్తాయని కడప లో ఉన్న ప్రజలందరూ బాగుపడతారని కావున తప్పక కడపలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్విపిఎస్ జమ్మలమడుగు అధ్యక్షులు ధారా కిరణ్ పాల్గొన్నారు.