
ఆస్పరి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ
కర్నూలు న్యూస్ వెలుగు; ఆస్పరి పోలీసు స్టేషన్ ను కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
సిబ్బంది పని తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు, సలహాలు చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 
నేను సైబర్ స్మార్ట్ అనే అవగాహన కార్యక్రమంతో ప్రజలకు , విద్యార్దులకు అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా చేయాలని ఆదేశించారు.
వివిధ కేసులలో పట్టు బడిన వాహనాలను డిస్పోజబుల్ చేయాలన్నారు. యు ఐ కేసులు తగ్గించాలన్నారు. రాత్రి గస్తీ బాగా పెంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీసు స్టేషన్ ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. 
ఈ కార్యక్రమంలో ఆస్పరి సిఐ డి. మస్తాన్ వలి , ఆస్పరి ఎస్సై నరసింహులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar