
భారతి మిస్సింగ్ కేసును చేధించాలని కుల, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు;  కల్లూరు మండలం నాయకుల్లు గ్రామంలో జనవరి 1వ తేదీన భారతి @ శ్రీలక్ష్మి మిస్సింగ్ కేసును విచారించడంలో
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ…
కల్లూరు మండలం నాయకుల్లు గ్రామంలో జనవరి 1వ తేదీన ఉదయం 11 గంటల సమయం నుండి వివాహిత మహిళ భారతి గుప్త నిధులకోసం తవ్వకాలు జరిగినా, మహిళలపై లైంగిక దాడులు జరిగినా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ నేరాలను అరికట్టడంలో విఫలమయ్యారు. కావున భారతి అదృశ్య కేసును మహిళా పోలీసు ఉన్నతాధికారితో విచారణ జరిపించి వాస్తవాలు బహిర్గతం చేయాలని తమరిని సవినయంగా కోరుచున్నాము.
నాయకల్లు గ్రామంలో కొంతమందికి వున్న రాజకీయ పలుకుబడివల్ల విచారణకు నోచుకోని పలు నేరాల కేసులు.
1. ఉలిందకొండ పెట్రోల్ బంకులో దోపిడీ చేసి అందులో పనిచేస్తున్న అబ్బాయిని చంపిన సంఘటన.
2. తెలంగాణ రాష్ట్రం ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శిఖామణి అల్లుడిని చంపిన సంఘటన.
3. వెల్దుర్తి మండలం అల్లుగుండు దగ్గర బస్సు దోపిడీ చేసిన సంఘటన, సంఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షిని నరికి చంపిన సంఘటన.
4. కిరాయి తీసుకొని చిందుకూరు శివరామిరెడ్డిని చంపిన సంఘటన.
5. నాయకల్లు దళితుడైన సుంకన్నను కొట్టి చంపిన సంఘటన.
6. డోన్, బేతంచర్ల మండలాలలో పొలాల్లో మోటార్ల దొంగతనాలు చేసిన సంఘటన. మరియు నాయకల్లు గ్రామంలో గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల కేసులు. 
ఈ కార్యక్రమంలో పట్నం రాజేశ్వరి,శేషఫణి,ఎరుకల రాజు,నంది విజయలక్ష్మి, కె జయన్న,క్రాంతి కుమార్, యం.అశోక్ కుమార్,తాటికొండ కుళ్ళయప్ప,నక్కలమిట్ట శ్రీనివాసులు,కైలాష్ నాయక్,భారత్ కుమార్ ఆచారి,పగడాల ఆనంద్ బాబు,ఇక్బాల్,భాస్కర్,భారతమ్మ,పాలెం రాధ,సుంకమ్మ,ఎలిషమ్మ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar