
కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
డోన్, న్యూస్ వెలుగు; డ్రైవర్ల జీవితాలతో చెలగాటం ఆడే భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ (1)(2) లను రద్దు చేయాలని,రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF) సెప్టెంబర్ 28 29 30 వ తేదీలలో నంద్యాల జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మోటార్ వర్కర్స్ యూనియన్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఎల్లయ్య, సహాయ కార్యదర్శి టి.శివరాం, ఉపాధ్యక్షులు ఏవి.భాస్కర్ రెడ్డి,సిఐటియు మండల అధ్యక్షులు పి. రామాంజనేయులు రవాణా రంగ కార్మికులకు పిలుపునిచ్చారు.స్థానిక కొండపేటలోని మోటార్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం నందు శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
కామ్రేడ్”ఏచూరి గారికి ఘన నివాళులు
ముందుగా శ్రమజీవుల అరుణ తార,దేశం గర్వించదగ్గ నేత,సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్” సీతారాం ఏచూరి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో డ్రైవర్ల సంక్షేమం కోసం కృషి చేసిన దాఖలాలు లేవని,రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయడం లేదని,కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బోర్డు తరహాలో ప్రతి రాష్ట్రం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని,డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని, ప్రతి 50 కిలోమీటర్లకు విశ్రాంతి తీసుకోవడం కోసం విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేయాలని,డ్రైవర్లకు కనీస వేతనం అమలయ్యేలా ప్రభుత్వం యజమానులపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.లేనియెడల రాబోవు కాలంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించడానికి సిద్ధం కావాలని,కార్మికుల జీవితాలతో చెలగాట మాడే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని,గతంలో రైతుల పోరాటం ఏ విధమైన ఉధృతికి దారి తీసిందో ఆస్పూర్తితో పోరాటాలు సాగించాలని,దేశానికి అన్నం పెట్టే రైతన్న దేశానికి వెన్నెముక లాగా ప్రతి వస్తువు ప్రజలకు చేరాలంటే డ్రైవర్ కూడా అంతే ముఖ్యమని,ప్రభుత్వాలు మనుగడ సాగించడానికి కావలసిన ఆర్థిక వనరులు సింహభాగం రవాణా రంగం నుండే సమకూరుతున్నాయని, ఇటువంటి రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ప్రభుత్వాలు పాలన సాగించడం కష్టమవుతుందని,డ్రైవర్లు అంత ఏకమై ఆందోళనల కు పూనుకుంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుందని, ప్రభుత్వం పునరాలోచించు కోవాలని హెచ్చరించారు భారత న్యాయ సంహిత చట్టం 106(1),2 లను రద్దు చేసేంతవరకు భవిష్యత్ కార్యాచరణ కొరకు AIRTWF ఆధ్వర్యంలో నంద్యాలలో సెప్టెంబర్ 28 29 30వ తేదీలలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర సదస్సులో తీసుకునే నిర్ణయాల్లో రవాణా రంగ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వర్కర్స్ యూనియన్ కోశాధికారి ఎస్.సుబ్బారెడ్డి,లారీ మెకానిక్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎలక్ట్రిషన్ రంగడు,అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.కె.హుస్సేన్,లింగం,కమిటీ సభ్యులు మాసం భాష,గౌస్, ప్రైవేట్ స్కూల్ బస్సు యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.మద్దిలేటి,నాయకులు నూర్ భాషా,గోపాల్,ఖాసీం,కంబగిరి, రంగస్వామి,ఆర్టీసీ హయర్ బస్సు యూనియన్ అధ్యక్షులు సుబ్బయ్య గౌడు,మినీ లారీ వర్కర్స్ యూనియన్ నాయకులు మస్తాన్,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, నాగేశ్వరరావు,మహేష్, మద్దయ్య,రాంబాబు,శేఖర్, తిమ్మయ్య,రామకృష్ణ,సూరన్న, బాబు తదితరులు పాల్గొన్నారు.