పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్లు జైలు శిక్ష, రూ. 20 వేలు జరిమాన
కర్నూలు జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు తీర్పు వెలువరింపు.
ముద్దాయిలకు కఠిన శిక్షల కై గట్టి చర్యలు చేపట్టిన … జిల్లా ఎస్పీ
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు పట్టణం లోని బుధవార పేటలో గౌండ( బేల్ దార్) గా బొగ్గుల రాజేష్ ( 30. సం.రాలు) పని చేస్తున్నాడు .కర్నూలు , బుధవార పేటలో 10 సం.రాల ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్యకర ఫోటోలు చూపిస్తూ, మాట్లాడటంతో పాటు లైంగికంగా బలవంతం చేశాడు.సదరు బాలిక తల్లి యశోధ ఫిర్యాదు మేరకు 2021 జూన్ 23 వ తేదీన కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 372 / 2021 u/s 12 of పోక్సో యాక్ట్ ( SC No : 50 / 2021 ఆఫ్ ఫోక్సొ ఆక్ట్ నమోదు చేశారు. అప్పటి కర్నూలు మూడవ పట్టణ ఎస్సై రెహమతుల్లా , మహిళా పియస్ ఎస్సై కొండయ్య లు దర్యాప్తు చేపట్టి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు.
అన్ని కోణాల్లో విచారించిన కర్నూలు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు ( 7th అడిషనల్ ఇంచార్జ్) జడ్జి భూపాల్ రెడ్డి నిందితుడు బొగ్గుల రాజేష్ కు మూడేళ్లు జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. స్పెషల్ పి.పిలు వెంకటేశ్వరెడ్డి , ప్రతాప్ రెడ్డి, దర్యాప్తు అధికారులు కర్నూలు త్రీ టౌన్ కు చెందిన ఎస్సై రెహమతుల్లా, మహిళా పియస్ ఎస్సై కొండయ్య, కర్నూలు త్రీ టౌన్ కోర్టు కానిస్టేబుల్స్ జాన్సన్ ఇమ్మానుయేల్ ,కిశోర్ లను కర్నూలు జిల్లా ఎస్పీ అభినందించారు.