
ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిఎంహెచ్ఓ కు వినతి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలలో ప్రభుత్వము అలర్ట్ చేసిన కన్వీనర్ కోటాలో తాజుద్దీన్ చదువుతున్నారు తాజుద్దీన్ కి ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వచ్చిన వెంటనే మొత్తం చెల్లిస్తానని ఇప్పటికే 70 వేల రూపాయలు కళాశాలకు చెల్లిస్తానని చెప్పినప్పటికీ మొత్తం కట్టాలి లేదంటే పరీక్షకు అనుమతించమని చెప్పి రెండవ సంవత్సరం పరీక్షలకు అనుమతించకుండా విద్యార్థి జీవితాన్ని నాశనం చేశారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప అబ్దుల్లా రాఘవేంద్ర నగేష్ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ హుస్సేన్ భాష కలిసి డిఎంహెచ్ఓ కి వినతి పత్రం అందించారు.
రెండవ సంవత్సరం పరీక్షలకు అనుమతించకుండా అతని విద్య అర్హతలకు సంబంధించిన భవిష్యత్తును నాశనం చేసిన ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకొని విద్యార్థి తాజుద్దీన్ నీ వెంటనే రోజు క్లాసులకు అనుమతించాలని, రెండో సంవత్సరం పరీక్షలను కూడా నిర్వహించాలని వినతి. అలాగే నగరంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ అనుమతి లేకుండా షిఫ్టింగ్ చేసుకున్న నర్సింగ్ కళాశాలల పైన, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్దేశించిన ఫీజులకంటే అధికంగా వసూలు చేస్తున్న నర్సింగ్ కళాశాలల పైన, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు అబుబక్కర్ అర్యన్ మల్లేష్ కాజా తదితరులు పాల్గొన్నారు