సాక్షి రిపోర్టర్ లపై దాడికి పాల్పడిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలి
కల్లూరు తహసీల్దార్ కు ఆ వినతిపత్రం అందచేత
న్యూస్ వెలుగు, కల్లూరు : కడప జిల్లా,పులివెందుల నియోజకవర్గం,వేముల మండలంలో సాగునీటి ఎన్నికల కార్యక్రమంలో భాగంగా కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్,సాక్షి పత్రిక కెమెరామెన్ రాము, రాజారెడ్డిలపై దాడికి పాల్పడిన ఎన్ డిఎ కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా,కల్లూరు మండలం జర్నలిస్ట్ లు శుక్రవారం కల్లూరు తహసీల్దార్ కె. ఆంజనేయులుకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా జర్నలిస్ట్ లు పురుషోత్తం, శ్యామ్, బి.వై.శ్రీనివాసులు,విజయ్ కుమార్,దేవరాజు, నాగరాజు,శ్రీనివాసులు,ఆర్.బి.శ్రీనివాసులు మాట్లాడుతూ వార్తలు కవరేజ్ కు వెళ్లిన రిపోర్టర్ లపై దాడిచేయడం హేయమైన చర్య అన్నారు.ఈ దాడిని జర్నలిస్ట్ లు పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.సాక్షి రిపోర్టర్ లపై దాడికి పాల్పడిన కూటమి నేతలపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమంను తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు.