
ఉస్మానియా కళాశాల మైదానంలో వసతుల కల్పనకు చర్యలు
న్యూస్ వెలుగు, కర్నూలు. నగరపాలక సంస్థ; పాతబస్తీలోని ఉస్మానియా కళాశాల మైదానంలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు తెలిపారు. బుధవారం సంబంధింత కార్పొరేటర్లలతో కలిసి ఉస్మానియా కళాశాల మైదానాన్ని కమిషనర్ పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం మైదానంలో స్వచ్ఛత పనులు చేపట్టాలని, వాకింగ్ ట్రాక్ నిర్మించాలని కార్పొరేటర్లు కోరారు. స్వచ్ఛత పనులు వెంటనే చేపడతామని, వసతుల కల్పన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు యూనూస్, జుబేర్, పారిశుద్ధ్య తనిఖీదారుడు జిలాని తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar