అనదికార దర్శనాల కట్టడికి చర్యలు
ఆలయ ఈవో కె ఎస్ రామారావు ఆకస్మిక తనిఖీలు
వృద్దులు, వికలాంగుల వసతుల క్షేత్ర స్థాయి పరిశీలన
ఏర్పాట్లపై భక్తులతో అభిప్రాయ సేకరణ
సంతృప్తి వ్యక్తపరచిన భక్తులు
విజయవాడ, న్యూస్ వెలుగు; దసరా మహోత్సవములు సందర్బంగా ఇంద్రకీలాద్రి పై జగన్మాత ను దర్శించుకొనుటకు వివిధ ప్రాంతముల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం 4 వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుండగా ఉదయం 3 గం. ల నుండి భక్తులు విశేషముగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆలయ ఈవో కె ఎస్ రామారావు భక్తులకు అందుచున్న పలు ఏర్పాట్లుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగముగా ఈవో క్యూలైన్ లలో టికెట్ లు పరిశీలించారు. స్కానింగ్ పాయింట్ వద్ద నిలబడి టికెట్లు మరియు పాస్ ల క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి తనిఖీ లు నిర్వహించారు.ఇటీవల వృద్దులు, దివ్యాంగులు మరియు నడవలేని వారికోసం ఏర్పాటు చేసిన స్టైర్ కేసు లిఫ్ట్ ను స్వయముగా పరిశీలించారు. పలువురు భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలు స్వీకరించగా వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు.