సమస్యల పరిష్కారానికి చర్యలు
న్యూస్ వెలుగు, కర్నూలు; కాలనీల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు. శనివారం కమిషనర్ అధికారులతో కలిసి కల్లూరు ఎస్టేట్లో పర్యటించారు. కాలనీలో తాగునీటి పైప్లైన్ నిర్మాణ సమయంలో రహదారి గుంతలమయంగా మారిందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే తాగునీటి సరఫరా మెరుగుపరచాలని, రహదారి మురుగు కాలువలు నిర్మించాలని స్థానికులు కోరారు. స్పందించిన కమిషనర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజారోగ్యధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, డిఈఈ క్రిష్ణలత, ఏఈలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!