
కాలనీల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్రబాబు
పైప్‌లైన్, కొళాయిల వద్ద లీకేజీలను అరికట్టాలి
.మురుగు కాలువల్లో తక్షణమే మరమ్మత్తులు
కర్నూలు, న్యూస్ వెలుగు; నగర పరిధిలోని కాలనీల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు తెలిపారు. శుక్రవారం 46వ నరసింహారెడ్డి నగర్‌లో వివిధ కాలనీల్లో కమిషనర్ విసృతంగా పర్యటించారు. ఆయా కాలనీల్లో పూడికతీత పనులు, ధ్వంసమైన మురుగు కాలువలు, కేసి కాలువ వద్ద రక్షణ వలయంలను పరిశీలించారు. వాటికి మరమ్మతులు చేపట్టాలని, వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి వృథాకు ఆస్కారం లేకుండా తక్షణమే పైప్‌లైన్, కొళాయిల వద్ద లీకేజీలను అరికట్టాలని పేర్కొన్నారు. అలాగే వివిధ కాలనీల్లో మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. అంతకన్నా ముందు ఆయన కలెక్టరేట్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. అదేవిధంగా నెహ్రూ నగర్, పోస్టర్ కాలనీ, ఎస్టిబిసి గ్రౌండ్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీనివాసరావు, డిఈఈ గంగాధర్, ఏఈ నాగజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.