అమ్మ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన నటుడు మోహన్ లాల్
న్యూస్ వెలుగు సినిమా : మలయాళ చిత్ర పరిశ్రమలో ఉహించని పరిణామాల చోటుచేసుకుంటున్న పరిస్థితి నెలకొంది . నటుడు మోహన్‌లాల్ మలయాళ సినీ కళాకారుల సంఘం (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పరిశ్రమలో మహిళా ఎదుర్కొంటున్న సమస్యలపై కె. హేమ కమిటీ నివేదిక తర్వాత పరిణామాలు చోటుచేసుకున్నాయి .
ఈ నివేదిక నేపథ్యంలో మోహన్‌లాల్‌తో పాటు మొత్తం 16 మంది సభ్యులతో కూడిన అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమిష్టిగా వైదొలిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో అమ్మ మాజీ ప్రధాన కార్యదర్శి, నటుడు సిద్ధిక్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఈ నిర్ణయం తీసుకున్నారు. సిద్ధిక్ రాజీనామా తర్వాత యాక్టింగ్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన నటుడు బాబురాజ్ ఉపసంహరించుకున్నారు. అనేక మంది మహిళా నటులు తమ బాధాకరమైన అనుభవాలను పంచుకుంటూ ముందుకు రావడంతో హేమ కమిటీ నివేదిక అందించింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న నేరాలపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కేరళ ప్రభుత్వం స్పందించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న తన మొదటి అధికారిక సమావేశాన్ని నిర్వహించింది.