అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకరు…!
అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకరు…. ఒక రోగికి ప్రాణం పోస్తాడు వైద్యుడు, ఒక తరానికి దిక్సూచి అవుతాడు కవి, ఒక నాటకానికి మార్గదర్శకుడు అవుతాడు ప్రయోక్త, ఒక సభకు సమగ్ర చేతను కల్పిస్తాడు నిర్వాహకుడు, ఒక చిత్రానికి ప్రాణం పోస్తాడు చిత్రకారుడు. అలా ఇవన్నీ కలిసి ఒకే మనిషిలో ఉంటే అతడు ఒక అరుదైన వ్యక్తిత్వం ఉన్న మనిశైఉన్న ఆయన పలనాడులో పుట్టి, కోస్తా జిల్లాల్లో పెరిగి, విశాఖ నుంచి హైదరాబాద్ వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొని ఇంటా, బయట గెలిచి వైద్యునిగా, నిర్వాహకునిగా, చిత్రకారునిగా, ప్రయోక్తగా, కవిగా రాణిస్తూ రాష్ట్రంలో పలువురి మనల్ని పొందిన వ్యక్తి “ముంజంపల్లి శివకుమార్”.
దాచేపల్లి కి చెందిన ముంజంపల్లి శివకుమార్ గత పది సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు, ఉచిత మెడికల్ క్యాంపులు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తూ కోవిడి సమయంలో వందలాది మందికి వైద్య సహాయంతో పాటు మనోధైర్యాన్ని కల్పించి అనేకుల ప్రాణాలు కాపాడారు. ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ జీవితంలో ధనం కోల్పోతే కొంతే కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టేనని భావించి, నమ్మిన సిద్ధాంతం కోసం శ్రమిస్తూ సంతోషంగా సేవ చేస్తున్న శివకుమార్ కి సలాం.