
పీఎం కిసాన్ కి మీ ఫోన్ నెంబర్ ను యాడ్ చేయండి ఇలా …
న్యూస్ వెలుగు : రైతులకు శుభవార్త అందించిన కేంద్రం. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ సన్మాన్ నిధి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దీని ద్వారా రైతుకు సులభతరమైన విధానాలను అందించేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది . పీఎం కిసాన్ అప్డేట్ వివరాలను రైతులు పొందేందుకు మొబైల్ నెంబర్ ను మార్చవచ్చు . ముందుగా https://pmkisan.gov.in/ వెళ్లాలి . అందులో అప్డేట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేయగానే ప్రత్యేక విండో ఓపెన్ అవుతుంది . అందులో రిజిస్ట్రేషన్ లేదు ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది . ఇందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దానికి OTP అడుగుతుంది గతంలో మీ ఆధార్ కి ఇచ్చిన మొబైల్ నెంబర్ మెసేజ్ వస్తుంది అందులో వచ్చిన అంకెలను ఎంటర్ చేయాలి . తదుపరి మీరు మార్చవలసిన ఫోన్ నెంబర్ వివరాలను జోడించి ok ప్రెస్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కి కన్ఫర్మేషన్ వస్తుంది దింతో పీఎం కిసాన్ కు కొత్త నెంబర్ మార్చడం పూర్తవుతుంది.దింతో కేంద్రం 25-26 గాను 3915738 మంది రైతులకు పీఎం కిసాన్ నిధులను విధుల చేసింది.

