ప్రజా సమస్యలను నిర్దేశిత సమయంలో పరిష్కరించండి
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 13 వినతులు వెల్లువ
న్యూస్ వెలుగు, కర్నూలు నగరపాలక సంస్థ; ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే సమస్యలను తప్పనిసరిగా నిర్దేశితలోపు సమయంలో పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 13 వినతులను కమిషనర్ స్వీకరించారు. చట్ట పరిధిలోకి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అర్జీదారులకు కమిషనర్ హామీనిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆరోగ్యధికారి డా. కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, ఎంఈ సత్యనారాయణ, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
1. చింతలముని నగర్ నందు రహదారులు, మురుగు కాలువలు నిర్మించాలని, పందుల సమస్య పరిష్కారించాలని జి. ప్రభావతి, బి.వీరేంద్ర తదితరులు విన్నవించారు.
2. ఎస్.ఏ.పి. క్యాంపు నందు ఈ నెల 30 నుండి ఎస్.సి.టి. పోలీసు (సివిల్ కానిస్టేబుల్) రిక్రూట్మెంట్ జరుగుతుందని, ప్రత్యేక పారిశుద్ధ్య దళం, మొబైల్ టాయిలెట్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ జి.బి. మాధవ్ కోరారు.
3. కళావతి నగర్ నందు వీధి దీపాలు వెలగటం లేదని స్థానికులు పి.నారయణ ఫిర్యాదు చేశారు.
4. వెంకటరమణ కాలనీ ప్రేమ్ నగర్ నందు జన నివాసాల మధ్య ఓ వ్యక్తి పశువులను పెంచుకుంటూ, పరిసర ప్రాంతాలను అపరిశుభ్రం చేస్తున్నారని స్థానికులు జి.లక్ష్మిపతి యాదవ్ ఫిర్యాదు చేశారు.
5. రాధానగర్, రేణుక నగర్ నందు డ్రైనేజీ కాలువలు నిర్మించాలని స్థానికులు స్రావన్, ఉపేంద్ర తదితరులు కోరారు.
6. వెంకటరమణ కాలనీ వీనస్ కాలనీలో మురుగునీరు కాలువల సమస్యను పరిష్కరించాలని స్థానికులు బి.క్రిష్ణ మోహన్, బి.శివయ్య తదితరులు కోరారు.
7. టిడ్కో గృహం మంజూరు కాకపోయినా బ్యాంకుల్లో నగదు కట్ అవుతున్నాయని, ఆలాగే అనర్హులు కాబడినందున తాము చెల్లించిన డిడి వెనక్కి చెల్లించాలని టిడ్కో ధరకాస్తుదారులు కాంతం సునీత, డి.అనురాధ, తదితరులు అర్జీలు ఇచ్చారు.
8. బంగారుపేటలోని ఆనంద్ థియేటర్ సమీపంలో కెసి కెనాల్ వద్ద రోడ్డు విస్తరణలో తాము నివాసాలు కోల్పోయామని, తమకు గోడరాల ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నగరపాలక స్థలంలో తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని (షికారులు) రోడ్డు విస్తరణ బాధితులు కోరారు.