పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
* రైతులకు పలు సలహాలను తెలియజేసిన వ్యవసాయ శాఖ అధికారులు
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుఫాను ప్రభావంతో గత కొద్ది రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.మద్దికేర మండల పరిధిలో గత నాలుగు రోజులుగా 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవికుమార్ తెలియజేశారు.ఈ వర్షాల తాకిడికి పూతదశలో గల కంది, టమోట,ఉల్లిగడ్డ,పొగాకు మరియు పత్తి తదితర పంటలను శనివారం రోజున మండల వ్యవసాయ అధికారి రవి పరిశీలించారు.ఈ సందర్భంగా పంటల పరిశీలించి అధిక వర్షాలు తాకిడికి మరియు పురుగు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు పలు సూచనలను ఆయన రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భోజరాజు, వ్యవసాయ సహాయకులు జాకీర్,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!