
ఫైళ్లు అన్నీఆన్ లైన్ చేయాలి :సీఎం చంద్రబాబు
అమరావతి ( న్యూస్ వెలుగు ): రాష్ట్రంలో అభ్యంతరాలు లేని భూములను వీలైనంత త్వరగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రినారా చందబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్రసచివాలయంలో రెవెన్యూ, భూములు, ఆదాయార్జన శాఖలపైరెండవ రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రిసమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రెవెన్యూ విభాగానికివచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం మేర భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. రీసర్వే చేసి రికార్డులను సరిచేయాలని సూచించారు. కులం ధృవీకరణ పత్రాలను శాశ్వత ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 2.0 సంస్కరణల వల్ల రాష్ట్రపజలకు 8 వేల కోట్లరూపాయల మేర ప్రయోజనం ప్రతి ఏటా కలుగుతుందని చందబాబు నాయుడు తెలిపారు. పన్నుల తగ్గింపు ప్రయోజనాల ఈ నెల 22 నుంచి అక్టోబరు 22 వరకూ ప్రజలలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. రెవెన్యూ శాఖలో రెండు నెలల్లో నూరు శాతం ఫైళ్లు అన్నీఆన్ లైన్ లో ఉండాలని ముఖ్యమంత్రిస్పష్టం చేశారు.


