అఖిలభారత కురువంశ నిత్య అన్నదాన సత్రం సమావేశం

అఖిలభారత కురువంశ నిత్య అన్నదాన సత్రం సమావేశం

అధ్యక్షులు ఎం.కె.రంగస్వామి ఆధ్వర్యంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ
బస్తిపాటి నాగరాజు..

కర్నూలు, న్యూస్ వెలుగు; బుధవారం శ్రీశైలం చేరుకున్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు వారు ముందుగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయించుకోవడం జరిగింది అనంతరం శ్రీ అఖిల భారత కురువంశ సత్రం అధ్యక్షులు ఎం.కే రంగస్వామి ఆహ్వానం మేరకు ఈ సత్రం సమావేశంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.ఈ సమావేశంలో పలు విషయాలను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలం రాబోయే రోజులలో ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా మనం కూడా మనకు ఉన్నటువంటి కుల సంఘం సత్రం ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాలని భవిష్యత్తులో సత్రం ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా అభివృద్ధి చెందాలంటే దేశంలో,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ లో ఉన్నటువంటి కురువంశం కులసంఘం పెద్దలు,బంధువులు విరాళాలు ఇచ్చి సత్రం అభివృద్ధి చెందే విధంగా సహకరించాలని ప్రతి ఒక్క కురువంశ సంఘం నాయకులను,కులస్తులను, బంధువులను, ప్రజలను కోరడం జరిగింది.
అలాగే నా వంతు సహకారం ఏ విధంగానైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా కురువంశ కుల సంఘ నాయకులకు, పెద్దలకు, బంధువులకు తెలియజేయడం జరిగింది.ఈ సమావేశంలో అఖిలభారత కురువంశ నిత్య అన్నదాన సత్రం చైర్మన్ ఎం. కె.రంగస్వామి, ఉపాధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు గుడిసె శివన్న,నాగ శేషులు,కె.వెంకటేశ్వర్లు,కురువ సంఘం నాయకులు కొత్తపల్లి దేవేంద్ర, పాల సుంకన్న, శివరాం బూదూరు లక్ష్మన్న, ధనుంజయ, కె సి నాగన్న, తవుడు శ్రీనివాసులు, శ్రీ లీలమ్మ, ఉమ్మడి జిల్లా గొర్రెల సహకార సంఘము ప్రెసిడెంట్ శ్రీనివాసులు మెంబర్లు యుగంధర్,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!