అఖిల భారత విద్యార్థి సమాఖ్య మహ సభలు విజయవంతం
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి వలరాజు, మాజీ విద్యార్థి నాయకులు ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని వాటి నీ ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ కేంద్రం వరకు అనేక రకాల సమస్యలు తో విద్యార్థులు ఉన్నారని, ప్రధానంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థులందరికీ రియంబర్స్మెంట్ అందించాలని కొరకు యూనివర్సిటీ నిధులు కేటాయించాలని అవినీతి అక్రమాల పైన చర్యలు తీసుకోవాలని,పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ గృహాలుకు నిధులు కేటాయించి పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ చార్జీలు అందించాలని డిమాండ్ చేశారు అనంతరం నూతన కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగిందని, కార్యదర్శిగా అరవింద్, అధ్యక్షుడు వినయ్, సహాయ కార్యదర్శి నూర్, కాసిమ్, ఉపాధ్యక్షులుగా ఆదిత్య విశాల్ ,రాజా, ట్రెజరర్ షరీఫ్, మరియు కార్తీక్ అరుణ్ లను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి లీలా కృష్ణ, ప్రొద్దుటూరు నాయకులు, పీటర్ ,తోసిప్ ,సుబ్బరాయుడు వాసు విద్యార్థులు పాల్గొన్నారు .