అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వం

అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వం

Delhi (ఢిల్లీ ) : బంగ్లాదేశ్ అంశంపై ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ ఈ అంశంపై నేతలకు వివరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ, ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే, ఆర్జేడీ నాయకురాలు మిసా భారతి, ఎస్పీ నేత ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, డీఎంకేకు చెందిన టీఆర్ బల్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.  కేంద్ర మంత్రి, జేడీ(యూ) నేత లలన్ సింగ్, కేంద్ర మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి, కేంద్ర మంత్రి, టీడీపీ నేత రామ్‌మోహన్‌నాయుడు, ఎల్‌జేపీ(ఆర్‌) నేత అరుణ్‌భారతి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎక్కువగా చదివింది

Author

Was this helpful?

Thanks for your feedback!