ప్రజలంతా డిపాజిట్ ఖతాల గురించి తెలుసుకోవాలి 

ప్రజలంతా డిపాజిట్ ఖతాల గురించి తెలుసుకోవాలి 

ఆర్థిక ప్రణాళిక మరియు బడ్జెట్ గురించి అవగాహన కలిగి ఉండాలి

కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీ సుబొద్ బి వాన్వే

న్యూస్ వెలుగు, నంద్యాల ; నంద్యాల జిల్లా మున్సిపల్ ఆఫీసులోని మెప్మా కార్యాలయంలో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీ సుబొద్ బి వాన్వే గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులు వివిధ డిపాజిట్ ఖతాల గురించి తెలుసుకోవాలి అని ప్రతి ఒక్క పౌరుడు ఆర్థిక ప్రణాళిక మరియు బడ్జెట్ పై అవగాహన కలిగి ఉండి తప్పకుండా పాటించాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమo ను ఉద్దేశించి ఎపిజిబి బ్యాంకు సీనియర్ మేనేజర్ రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని డిజిటల్ పేమెంట్స్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని, మీ యొక్క ఓటీపీ పిన్ నెంబర్లు వ్యక్తిగత వివరాలు ఇతరులతో పంచుకోకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత పొదుపు అనేది చాలా ముఖ్యం అని మరియు ప్రతి ఒక్క మహిళ యోజన కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవనజ్యోతి బీమా యోజన తప్పకుండా నమోదు చేసుకోవాలి అని చెప్పారు.ఈ వర్క్ షాప్, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అధ్వర్యములో, ప్రాజెక్టు డైరెక్టర్ వి.ఆంజనేయులు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్ పర్యవేక్షణ లో నిర్వహించ డమైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెప్మా సి ఎం ఎం శ్రీమతి శోభా గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పొదుపు అనేది చాలా అవసరమని పొదుపు చేయటం వల్లే ఈరోజు మహిళలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం చెంది వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని దీనిని భవిష్యత్తు తరాలకు కూడా నేర్పించాలని చెప్పారు.అలాగే ఈ కార్యక్రమంలో ట్రైనర్ అశోక్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ,కేవైసీ, నామిని, DICGC గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా రిసోర్స్ పర్సన్ నబీ రసూల్ మాట్లాడుతూ విద్యాలక్ష్మి , ఉద్గం పోర్టల్ గురించి తెలియజేయడం జరిగినది . ఈ కార్యక్రమం ఉద్దేశించి రిసోర్స్ పర్సన్ అనిల్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొదుపు పట్ల అవగాహన కలిగి ఉండాలని బడ్జెట్ ఏ విధంగా చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగినది. చివరిగా ప్రోగ్రాం కోఆర్డినేట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిపాజిట్ ఖాతాలతో కలిగేటువంటి అదనపు ప్రయోజనాల గురించి వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెహ్మా కార్యాలయ సిబ్బంది మరియు సి ఓ లు, ఆర్పీలు, ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగినది.

Author

Was this helpful?

Thanks for your feedback!