రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి

రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్

కర్నూలు, న్యూస్ వెలుగు: రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండేలా చూడాలని ఆ దుర్గామాతను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్ వేడుకున్నారు.

ఆదివారం సంకల్ బాగ్ వద్ద గంగా మాత విగ్రహానికి, దుర్గమాత విగ్రహానికి పూజలు నిర్వహించి రావణ దహనం గావించి, అనంతరం నిమజ్జనాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టి.జి. భరత్, మాజీ రాష్ట్ర సభ సభ్యులు టి జి వెంకటేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు టి.జి భరత్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఆ దుర్గామాతకు 9.రోజుల పాటు భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా కర్నూలు నగరంలో అంగరంగ వైభవంగా పూజలందుకొని ఈరోజు అనగా 11వ రోజు నగరంలో దుర్గామాతల నిమజ్జనo కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో
సుభిక్షంగా ఉండేలా చూడాలని ఆ దుర్గామాతను వేడుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. గణేష్ నిమజ్జనం లాగానే దుర్గామాతల నిమజ్జనాలు కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీజీవి గ్రూపు ద్వారా దాదాపు 5 లక్షల రూపాయలతో 47 మట్టి దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని. ఇదేవిధంగా గణేష్ ఉత్సవాలను కూడా వచ్చే సంవత్సరం మట్టి విగ్రహాలతోని నిర్వహించుకోవాలని మంత్రి కోరారు. ఇలా చేయడం కొరకు విశ్వహిందూ పరిషత్ వారు, ఆర్ఎస్ఎస్,భక్తులు అందరు సహకరించి మట్టి విగ్రహాలు వాడడంలో కర్నూలు రాష్ట్రంలో నంబర్వన్ గా ఉండేలా చూడాలన్నారు. గత 22 సంవత్సరాల నుంచి దుర్గామాతల నిమర్జనాలు నిర్వహించుకోవడం రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మన కర్నూలు లో నిర్వహించుకుంటున్నామన్నారు.

కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ దుర్గామాత నిమజ్జన ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నామని ఈ సంవత్సరము కంటే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరిగేలా జరుపుకోవాలని. కర్నూల్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా ఆ దుర్గామాత ప్రజలను ఆశీర్వదించిందని ఎంపీ అన్నారు.

పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ. దుర్గామాత దయవల్ల దసరా శరన్నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నాం నెల క్రిందట గణేష్ నిమజ్జనాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని, అదే రీతిలో ఈరోజు దుర్గామాత నిమజ్జనాన్ని కూడా నిర్వహించుకుంటున్నామని శాసనసభ్యులు అన్నారు. కర్నూల్ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆ దుర్గామాతను వేడుకుంటున్నానని శాసనసభ్యులు అన్నారు.

రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నగరంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం నగరంలో ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలో జరుగుతుందని చెప్పారు. దుర్గాదేవి మహిషాసురుని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని దసరా పర్వదినాన్ని నిర్వహిస్తామని వివరించారు. అలాగే రామాయణంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేశారని వివరించారు. మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై పెట్టారని, ఆయుధాలు తుప్పు పట్టకుండా ఉండేందుకే వారు జమ్మి చెట్టుపై పెట్టారు అన్న ప్రచారం వినినట్లు చెప్పారు. వీటన్నిటినీ పరిశీలిస్తే దేవతలు దుష్టశక్తులను సంహరించేందుకు వచ్చినట్లు తెలుస్తుందన్నారు. ఇకపోతే ఓటు అనేది ప్రజల చేతిలో ఆయుధమని, వారు దానిని సక్రమంగా వినియోగిస్తే మంచివారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అవుతారని, లేకపోతే రాక్షసులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును మంచి వారిని ఎన్నుకునేందుకు వినియోగించాలని కోరారు. ఈ విషయంలో ఎంత మాత్రం పొరపాటు చేసినా రాక్షసున్ని ప్రజాప్రతినిధిగా సృష్టించడం జరుగుతుందని, అదే జరిగితే రాక్షసుల పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలు కులాలు మతాల పిచ్చిలో కాకుండా ప్రజలకు మంచి చేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి, ధర్మాలను కాపాడుకోవాలని కోరారు.

నగర మేయర్ రామయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా గత 22 సంవత్సరాల కిందట టీజీవి గ్రూపు ద్వారా ప్రారంభించిన దుర్గామాత నిమజ్జనాలను నిర్విఘ్నేగ కొనసాగిస్తున్నారని అన్నారు. దుర్గామాత దయవల్ల మన జిల్లా లో రైతులకు ఆశాజనకంగా మంచి వర్షాలు పడి పాడిపంటలతో తులతూగాలని ఆ దుర్గామాతని కోరుకుంటున్నానని అన్నారు.

టీజీవి కళాక్షేత్రం వారి ద్వారా భక్తులను ఆకర్షించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జ్ఞాపకాలు అందజేశారు

ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నంది రెడ్డి సాయి రెడ్డి, కర్నూల్ నగర డి.ఎస్.పి బాబు ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!