జాబ్ కార్డులు ఉన్న వారందరికీ ఉపాధిహామీ కింద పనులను కల్పించాలి

జాబ్ కార్డులు ఉన్న వారందరికీ ఉపాధిహామీ కింద పనులను కల్పించాలి

 వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించిన

      జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు;  జాబ్ కార్డులు ఉన్న వారందరికీ ఉపాధిహామీ కింద పనులన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు..
మంగళవారం వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు..ఈ సందర్భంగా కలెక్టర్ పని ప్రదేశంలో పని చేస్తున్న కూలీలతో సంభాషించారు..ప్రతి రోజు పనులకు ఏ సమయానికి వస్తున్నారు, ఎంత సేపు ఉంటారు, కూలీ ఎంత పడుతోంది అని ఆరా తీశారు..వేసవి కాలం అయినందున ఉదయం త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు..త్వరలో వేతనం మంజూరు కు సంబంధించి నిధులు విడుదల అవుతాయని కలెక్టర్ కూలీలకు తెలిపారు..
అనంతరం అధికారులతో మాట్లాడుతూ పనులు ఎక్కడ నుండి ఎక్కడ వరకు పెట్టారు, ఎంత మంది పనులకు హాజరయ్యారు అని కలెక్టర్ మస్టర్ డేటా ద్వారా వెరిఫై చేశారు.. ఎన్ఎంఎస్ఎస్ యాప్ లో అప్డేట్ చేస్తున్నారా, వేతనాలు ఎంత ఇస్తున్నారు, వేతనాలు ఇచ్చినట్లు కూలీలకు రిసీప్ట్ ఇస్తున్నారా అని కలెక్టర్ ఫీల్డ్ అసిస్టెంట్ ను అడిగి తెలుసుకున్నారు..
ఆర్థిక సంవత్సరం మార్చి తో ముగియనందున కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ డ్వామా పిడి ని ఆదేశించారు.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఈ మూడు నెలల్లో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒకరికి ఎక్కువ సంఖ్యలో ఉపాధి పనులు కల్పించాలని కలెక్టర్ డ్వామా పిడి ని ఆదేశించారు.. ఫామ్ పాండ్ లను కర్నూలు జిల్లా లో ఒకప్పుడు బాగా చేసేవారని, అదే విధంగా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ఫామ్ పాండ్ లను తవ్వి నీటిని నిలువ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు…

పలుగు చేత పట్టిన జిల్లా కలెక్టర్

ఉపాధి హామీ పనులను పరిశీలించిన సందర్భంలో జిల్లా కలెక్టర్ కాసేపు పలుగు చేత పట్టి కూలీలతో కలిసి మట్టి తవ్వి వారితో ముచ్చటించారు..
కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ సందీప్, డ్వామా పిడి వెంకటరమణయ్య, తహశీల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఎంపిడిఓ సుహాసిని, డ్వామా ఎపిడి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?

Thanks for your feedback!