గీత కార్మికులకు 340 మద్యం దుకాణాల కేటాయింపు : మంత్రి కొల్లు రవీంద్ర

గీత కార్మికులకు 340 మద్యం దుకాణాల కేటాయింపు : మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: ఏపీలో మద్యం దుకాణాలను  పారదర్శకంగా కేటాయించామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర  తెలిపారు. ఇప్పటికే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.గీత కార్మికులకు  340 దుకాణాల కేటాయింపునకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు వివరించారు. నవంబర్‌ 15 లోపు దుకాణాల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్‌ కమిటీ వేస్తామని, డిస్టిలరీస్‌ను టెండర్‌ కమిటీ సంప్రదించి ధరలు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!