అర్హులైన పేదలకు ఇంటి స్థలాలను కేటాయించి నిర్మాణాన్ని చేపట్టాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల పరిధిలోని గల అన్ని గ్రామ సచివాలయాల ఎదుట రాష్ట్రంలో గల అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పెన్షన్లు,ఇంటి స్థలాలు పల్లెల్లో మూడు సెంట్లు మరియు పట్టణంలో రెండు సెంట్లు ఇచ్చి వాటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం రోజున తుగ్గలి మండలంలోని అన్ని సచివాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి, సచివాలయ ఉద్యోగులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారు అందజేశారు.కావున ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి, రైతులకు పెట్టుబడి క్రింద 20 వేల రూపాయలు జమ చేయాలని,సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేసి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా సమితి సభ్యులువెంకటేశ్వర్లు, రోళ్లపాడు సీపీఐ సీనియర్ నాయకులు హనుమంతు, శాఖా కార్యదర్శి కాశీమ్,మంగ్య నాయక్, తులసి నాయక్,కమల్ తదితరులు పాల్గొన్నారు.