
స్నేహితునికి అండగా పూర్వ విద్యార్థులు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: 1996వ సంవత్సరం పదో తరగతి చదువుకున్న స్నేహితులు తమ బాల్య మిత్రుడు తొగుట వెంకటరమణ కు అండగా నిలిచారు. వారంతా బాల్య స్నేహితులు వివరాల్లోకి వెళితే బండి ఆత్మకూరు మండలంలోని సంతజూటూరు గ్రామానికి చెందిన వెంకటరమణ కరెంటు పని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. కొన్ని నెలల కిందట ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి కరెంటు స్తంభం పైనుంచి కిందపడి వెన్నుపూస దెబ్బతిని నడవలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు. విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి వెంకటరమణ కుటుంబాన్ని ఆదుకోవాలని తలచి రూ.75 వేల రూపాయలు నగదు 300 కేజీలు బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాలే చంద్ర శీను నాగరాజు సుధాకర్ హరి కుమార్ పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!